మేము పవన్ కళ్యాణ్ ని మా దేవుడు అనే అంటాం

ఒక యంత్రానికి అది చేయాల్సిన పనిని ఆయా కోడ్ రూపం లో సాఫ్ట్వేర్ నీ ప్రోగ్రాం చేసిన్నప్పుడు ఆ యంత్రం దానికి తగిన విదంగా నడుస్తుంది అలాగేయ్ మనలో చాలామందిమి కొన్ని భావావేశాలకు ఎంత బలంగా ప్రోగ్రామ్ అయ్యి
, ఆ ఆవేశాలకు ఎందుకు లోనవుతుంటామో వాటికి సంబంధించిన ప్రాథమిక
అవగాహన కూడా మనకుండదు. ఇది ఎప్పుడు గమనించానంటే, నేను, నా మిత్రుడు
ఓసారి ఆజ్ఞ్యతవాసి సినిమా గురించి మాట్లాడుతున్నాం. వెనుకాల మరొకడు నుండి ఆజ్ఞ్యతవాసి అదొక పెద్ద ఫ్లోప్ అని వినగానే నా స్నేహితుడు వాడి మీద చాలా కోపంగా విరుచుకుపడ్డాడు,ఖచ్చితంగా అదే ఎమోషన్ నేను తాను ఎంతగా స్తుతించే యేసు క్రీస్తు గురించి మాట్లాడినప్పుడు చూసాను 
పవర్ స్టార్ అని పిలవబడే పవన్ కళ్యాణ్ నాకెప్పుడూ ఒక హీరో.ఆయనని అభిమానించే కోట్లాది ప్రజల్లాలో నేను ఒక్కడిని.
ఆ అభిమానం నన్నతన్ని కళావాణి ఆస కలిగించింద.అందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఆయన్ని కలవడం నావల్ల కాలేదు అని చెప్పడం లో ఆచర్యం లేదు.ఎలాగో కలవలెను కాబ్బటి అయన గురించి తెలుసు కుండం అని  పవన్ కళ్యాణ్ గురించి న్యూస్ వచ్చే ప్రతి న్యూస్ చదివాను, తన వీడియో లు చుసాను,ఇంటర్వూస్,సినిమాలు,రాజకీయం గురించి తెలిసాక  నాకు అయన మీద అభిమానం తో పాటి
ఆశ్చర్యం కూడా పెరిగింది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ నేను చూశాను. కోపం, ప్రేమ, ఇష్టం,
ఆనందం, విషాదంలాంటి మానవ స్థాయీ భావాల్ని (బేసిక్ ఎమోషన్స్)
అత్యంత సహజంగా నటించడం లో అతనికి అతనే సాటి.
అతను తన చుట్టూవున్న ప్రపంచాన్ని చూసే పద్ధతి చాలా గొప్పగా 
వుంటుంది.పరాజయం విజయాలకతీతంగా వ్యక్తిత్వాన్ని నిర్మించు
కోవడాన్ని అందరికి  సాధ్యం కాదు కొందరు మాత్రమే చేయగలరు. ఆ కొందరులో ఒకడు
పవన్ కళ్యాణ్.తాను ఎంతగానో నమ్మిన ప్రజల్లే వల్లనే తాను గోరా రాజకీయ పరాజయం ఎదురుకున్న,అతను ప్రజల కోసం ప్రశ్నితు పోరడు తూనే ఉన్నాడు అనితరమైన అతని ప్రశ్నించే శక్తి అతని ఆయుధం.
పవన్ కళ్యాణ్ యొక ఆ వ్యక్తిత్వం వల్లనే అతనికి మొదటిలో చెప్పిన విధంగా,పవన్ కళ్యాణ్ గురించి గట్టిగా ప్రోగ్రాం ఐన అభిమానులు వచ్చి ఉండవచ్చు అతను ఒకవేళ
రాజకీయం లో ఎప్పటికీ విజయవంతం కాకపోయినా ఈ సమాజంలో ఏదో ఒక విధంగా
ఓ స్పష్టమైన ముద్రను మిగిల్చేవాడనేది మా నమ్మకం.
అతని గురించి తెలుసుకున్న తరువాత, అతని మాటలు విన్న తరువాత
నాకేమని పించిందంటే తాను ఏ తాత్త్విక భూమికనుంచి ఆలోచిస్తున్నానో
తన జీవిన తాత్వికత ఏమిటో యథార్థంగా అలాగే మనకు కనబడతాయి.
తాను చెయ్యాలనుకున్న పనిని సహనం,ఎంతో ఓపిక తో జయిస్తాడు, ఉదాహరణకి ఆయనకి కుషి తర్వాత ఆ రేంజ్ హిట్ గబ్బర్ సింగ్ వరకూ లేదు.
సినిమా మాధ్యమం ద్వారా తాను కమ్యూనికేట్ చేయలేకపోయిన ఆ అంశాల్ని ప్రజలకు ఉపయోగమైన పనులని తన పార్టీ జన సేన ద్వారా మనముందుకు తేవాలనే ప్రయత్నం
కనబడింది.
ఆయనని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే 
ఒక మంత్రి కొడుకు 
ఒక మంత్రి అయ్యాడు 
ఒక ధన వంతుడి కొడుకు 
ఒక ధనవంతుడు అయ్యాడు
కాని 
కానీ ఒక కానిస్టేబుల్ కొడుకు (ఇంటర్ ఫెయిల్) 
కొన్ని కోట్ల మందికి దేవుడయ్యాడు
అని ఒక వ్యక్తి చెప్పిన మాట నిజం అనిపిస్తుంది

ఎక్కడ దేవుడు అంటే మా ఉద్దేశం సృష్టి కర్త అని కాదు దీనినే మిగతావాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటారు. మనమందరం సామాజికంగా, దేవుని పరంగా కొన్ని కొన్ని
నిర్దేశించిన భావోద్వేగాలకు లోనయ్యేటట్టుగా ప్రోగ్రామ్ అయి ఉన్నాం. ఇదే గొప్పది
అనుకోవడం, దానికి విశ్వాసంగా ఉండటం, కట్టుబడి ఉండటం, అవి ఎందుకు
అలా చెబుతున్నాయో కూడా మనకు మనం ప్రశ్నించుకోకుండా వాటిని
అనుసరిస్తాం. అలా కాకుండా మనని మనం డీ ప్రోగ్రామ్ చేసుకోగలిగితే తిరిగి ఫ్రెష్ గా
రీ ప్రోగ్రామ్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ ఆ దెప్రోగ్రామ్ చేసుకోవద్దని మాకందరికి అందుబాటు కలిగిన ప్రోగ్రామింగ్ కోడ్ అని చెప్పవచ్చు దానికి కారణం ఆయన వ్యక్తికవం, మంచితనం,వివేకం వీటిలో ఏదైనా అవ్వచ్చు

గమనిక : నేను పైన చెప్పిన లాంటి విశ్లేషణ నేను కొన్ని వందల
మంది ఇతర హీరో ల ఫాన్స్ కి చెప్పాను. కానీ ఇంతవరకూ అర్ధమైనవాళ్లు ఒక్కళ్లూ లేరు.
దాని వలన నన్ను
నేను రీ రీ ప్రోగ్రామ్ చేసుకున్నాను.ఒకవేళ మీకు అర్థం కాకపొథెయ్ క్షమించండి

Comments

Post a Comment

Popular posts from this blog

Libet Experiment,Quantum Mechanics, Determism And Free Will.

The Quantum Internet Will Blow Your Mind. Here’s What It Will Look Like

Does a chair exist if nobody sees it? Relational quantum mechanics says ‘NO! ’